స్థానిక ఎన్నికల వేళ కీలక నిర్ణయం: నామినేషన్ల గడువు పొడిగింపు

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్లు అడ్డుకున్నారని ఫిర్యాదులు వచ్చిన చోట అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. పలు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల స్వీకరణ గడువును నూటయాభై గంటలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ ఇరవై మూడు, ఇరవై నాలుగు తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.