కుక్కునూరులో బాల్య వివాహం భగ్నం.. అడ్డుకున్న అధికారులు
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెం గ్రామంలో 14 సంవత్సరాల బాలికకు జరగాల్సిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు, బాల్య వివాహ నిరోధక కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. సీడీపీఓ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి వివాహాన్ని నిలిపివేశారు.
బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, చట్టపరమైన ఇబ్బట్లపై తల్లిదండ్రులకు అధికారులు అవగాహన కల్పించారు. బాలికలకు 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయకూడదని, చదువును ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గిరి భగవాన్ దాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.