బోనకల్లులో నకిలీ సదరం సర్టిఫికెట్ల జారీపై సమగ్ర విచారణకు డిమాండ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రాపల్లిలో సదరం సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంగవైకల్యం లేని వ్యక్తులు దళారుల సహకారంతో ఈ సర్టిఫికెట్లు పొందుతున్నారని, ఇందులో కర్నాటి బాబురావు, సంగెపు ముక్కటి పేర్లు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హులైన వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.