పరవాడ ఫార్మా వ్యర్థాల కాలుష్యంపై పీసీబీ షోకాజ్ నోటీసులు
రిపోర్టర్: శివ
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో రసాయన వ్యర్థాల కాలుష్యంపై మీడియా కథనానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించారని అధికారులు తెలిపారు. వెంటనే ఆ ప్రాంతంలో పర్యటించి నివేదిక సమర్పించాలని ఏపీపీసీబీ అధికారులను ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యర్థాలను కాలువలోకి విడుదల చేసిన తొంబై ఐదు పరిశ్రమలకు బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమైతే కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.