'హైదరాబాద్‌లో తొలిసారి': ఎల్బీనగర్‌లో మెట్రోతో రెసిడెన్షియల్ స్కైవాక్ నిర్మాణం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించి పాదచారులకు రక్షణ కల్పించేలా వాసవి గ్రూప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఎల్బీనగర్‌లోని 'వాసవి ఆనంద నిలయం' గేటెడ్ టౌన్‌షిప్‌ను ఎల్బీనగర్ మెట్రో స్టేషన్‌తో నేరుగా అనుసంధానిస్తూ ఎలివేటెడ్ స్కైవాక్ నిర్మాణానికి సిద్ధమైంది. నగరంలో ఒక నివాస సముదాయానికి మెట్రో కాంకోర్స్ నుండి స్కైవాక్ నిర్మించడం ఇదే మొదటిసారి కాగా, ఐఐటీ హైదరాబాద్ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తి చేయనున్నారు.