ఓట్ల రాజకీయాలు చేయను, పేదల సేవకే నా ప్రాధాన్యం: సోమిరెడ్డి

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

పేదల సేవకే ప్రతీక్షణం పరితపిస్తానని, ఓట్ల రాజకీయాలు చేయనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మిట్టపాళెంలో రూ.4 కోట్లతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దళితులు, మత్స్యకారులకు ఎకరాకు రూ.37 లక్షల వరకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఓట్లు తగ్గినా పేదల సేవలో రాజీ పడబోనని ఆయన తేల్చిచెప్పారు.