రాజస్థాన్ లో ఘోర ప్రమాదం: విద్యుత్ తీగలు తగిలి ఎనిమిది మంది మృతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఝున్ఝును
రాజస్థాన్ లోని ఝున్ఝును జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్తు తీగలు తగలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.