మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు మాజీ సీఎం జగనేనని సత్యప్రసాద్ వాంగ్మూలం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

ఏపీ మద్యం కుంభకోణంలో అప్పటి ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ ఏసీబీ కోర్టులో కీలక వాంగ్మూలం ఇచ్చారు. ఈ స్కామ్‌లో అంతిమ లబ్ధిదారు మాజీ సీఎం జగనేనని, నెలకు రూ.50 నుంచి రూ.60 కోట్లు వసూలు చేయొచ్చని జగన్ ఇంట్లోనే లెక్కగట్టారని తెలిపారు. వసూలైన రూ.3,200 కోట్లకు పైగా లంచాల సొమ్మును రాజ్‌ కెసిరెడ్డి ద్వారా అనిల్ రెడ్డి, బాలాజీ, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల మీదుగా జగన్‌కు చేరవేశారని వెల్లడించారు.