మేడ్చల్ జిల్లాలో పాతాళానికి భూగర్భ జలాలు: తీవ్ర ఆందోళనలో అధికారులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: మేడ్చల్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలమట్టాలు భారీగా పడిపోయినట్లు జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారి హరీష్ బాబు వెల్లడించారు. గతేడాది అక్టోబర్ నాటికి ఆరు మీటర్ల లోతులో ఉన్న నీటిమట్టాలు, ప్రస్తుతం పన్నెండు మీటర్లకు పైగా పడిపోయాయని ఆయన తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ముప్పు ముంచుకొస్తోందని, తక్షణమే నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.