ఖమ్మం రోటరీ నగర్లో పగిలిన పైపులైన్‌తో వృథా అవుతున్న నీరు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం రోటరీ నగర్‌లోని విజయ పాల డైరీ సమీపంలో ప్రధాన మంచినీటి పైపులైన్ పగిలిపోవడంతో శనివారం ఉదయం నుంచి వేలాది లీటర్ల నీరు వృథాగా రోడ్డుపాలవుతోంది. దీంతో పాల డైరీ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరింది. స్థానికులకు సరఫరా అయ్యే తాగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి, తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని ప్రాంతవాసులు కోరుతున్నారు.