విశాఖ మేయర్ పీఠం రిజర్వేషన్ ఖరారు: బరిలో ప్రముఖుల పేర్లు

రిపోర్టర్: శివ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠం రిజర్వేషన్ మహిళ జనరల్ గా ఖరారైందని Vizag News వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీసీ మహిళలకే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే యోచనలో ప్రధాన పార్టీలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ వరుదు కల్యాణి లేదా అనకాపల్లి మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతిని బరిలో దించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా కూటమిలోని తెలుగుదేశం పార్టీ కూడా అనువైన అభ్యర్ధుల కోసం అన్వేషణ ముమ్మరం చేసింది.