అలీబాగ్‌లో కట్న వేధింపుల కేసు నమోదు, పరారీలో భర్త, అత్తమామలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: మహారాష్ట్ర
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్‌లో కట్న వేధింపుల ఘటన కలకలం రేపింది. ఊర్మిళ గుప్తా అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త ప్రద్యుమ్న, అత్తమామలు అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేశారు. నిందితులు ముగ్గురూ పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.