బంగారు మైసమ్మ చండీయాగంలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన మహా చండీయాగం, హోమ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో యామంలో పాల్గొన్నారు.