తెలంగాణలో ఇరవై రెండు ఏ భూముల సమస్యల పరిష్కారానికి హైలెవల్ కమిటీ ఏర్పాటు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో సెక్షన్ 22-ఏ నిషేధిత భూముల జాబితా సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించి సత్వర పరిష్కారం చూపడానికి సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ చైర్మన్‌గా ముగ్గురు అధికారులతో కూడిన హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.