వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బేబీనాయన

రిపోర్టర్: GANESH BBL స్థలం: తెర్లాం

విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలలో రోడ్లు, గట్లు కోతకు గురయ్యాయి. గ్రామ పెద్దల సమాచారం మేరకు బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు శుక్రవారం ఆ ప్రాంతాలను సందర్శించారు. నందిగామ గ్రామంలో నీటి తాకిడికి దెబ్బతిన్న గట్టును పరిశీలించారు. అనంతరం బూరిపేట, ఎన్.బూర్జవలస గ్రామాల మధ్య కోతకు గురైన రోడ్డును స్వయంగా పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.