సాయికృష్ణ కేసులో జోక్యంపై ఎంపీ గురుమూర్తిని నిలదీసిన సుప్రీంకోర్టు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైన సాయికృష్ణ వ్యవహారంలో వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి పాత్రపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయికృష్ణ తల్లే కేసును పరిశీలించనప్పుడు మీకున్న ఆసక్తి ఏంటని ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం, ఎంపీలు హద్దు దాటి వెళ్లడానికి వీల్లేదని హెచ్చరిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.