ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
రిపోర్టర్: హరి
స్థలం: ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడు అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని, భక్తులు ఐక్యతతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి పనిలో విజయం లభించాలని గణపతిని ప్రార్థించారు. రాష్ట్రం అంతటా సుభిక్షంగా సాగాలని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.