జయమ్ము నిశ్చయమ్మురా షోలో నారా లోకేష్ అల్లరి జ్ఞాపకాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 టాక్ షోలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. విలక్షణ నటుడు జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో లోకేష్ తన స్కూల్ నాటి అల్లరి జ్ఞాపకాలను, బాలకృష్ణతో తన అనుబంధాన్ని సరదాగా పంచుకున్నట్లు తెలిపారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 6న ప్రీమియర్ కానుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.