ఓట్ల తొలగింపునకు ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్రనంటూ కాంగ్రెస్ ఆరోపణ
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
ఎస్ఐఆర్ పేరుతో మైనారిటీలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీల ఓట్లను బీజేపీ తొలగిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో ఆరోపించింది. ప్రజాస్వామ్య హృదయాలను దెబ్బతీసేలా కుట్రలు జరుగుతున్నాయని విమర్శించింది. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కాషాయ పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఈ మోసపూరిత రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది.