చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవని స్పష్టం చేసిన ఎస్పీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Kurnool

కర్నూలు జిల్లాలో సచివాలయ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు, వరద పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అనుమతి లేకుండా ర్యాలీలు లేదా ధర్నాలకు పాల్పడితే నిబంధనల ప్రకారం శాఖాపరమైన మరియు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగులు పోలీస్ శాఖకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.