నెల్లూరు తీర భద్రతకు గస్తీ బోట్ల ఏర్పాటులో జాప్యం

రిపోర్టర్: గోపి స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో భద్రతను పటిష్ఠం చేసేందుకు చేపట్టిన హై-స్పీడ్ గస్తీ బోట్ల తయారీ పూర్తి కావచ్చినా రాకపోకల్లో జాప్యం జరుగుతోంది. తమిళనాడులోని నాగపట్టణంలో రూ.2.40 కోట్ల వ్యయంతో ఈ బోట్లను తయారు చేయిస్తున్నారు. సెప్టెంబరు చివరి వారమైనా ఇంకా జిల్లాకు చేరలేదు. త్వరలోనే జిల్లా కమిటీ పరిశీలించి తీసుకొస్తామని మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావు తెలిపారు.