కోల్కతాలో బొగ్గు గనుల శాఖ పీఎస్యూ అధికారులతో జీ కిషన్రెడ్డి సమీక్ష
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
కేంద్రమంత్రి G Kishan Reddy కోల్కతాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నట్లు తెలిపారు. బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖల పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక అల్యూమినియం రోడ్ షోలో కూడా ఆయన పాల్గొననున్నారు. కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పురూలియా పార్లమెంట్ సభ్యులు జ్యోతిర్మయ్ సింగ్ మహతోతో పాటు కోల్ ఇండియా, హిందుస్తాన్ కాపర్, నాకో సీఎండీలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఘన స్వాగతం పలికారు.