భార్య ఇష్టమే ముఖ్యం అనుకుని ప్రియుడికి అప్పగించిన భర్త

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఉత్తర ప్రదేశ్

లక్నోలోని మలిహాబాద్‌లో విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. పెళ్లయిన కొద్దిరోజులకే భార్య సోనాలి తన బాల్య ప్రేమికుడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. విషయం తెలుసుకున్న పీఆర్డీ జవాన్ అయిన భర్త విక్కీ, ఆమెను బలవంతం చేయకుండా ఆమె సంతోషమే ముఖ్యమని భావించాడు. పోలీసుల సమక్షంలో భార్యను స్వయంగా ఆమె ప్రియుడికి అప్పగించి 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాను తలపించేలా నిజ జీవితంలోనూ త్యాగం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.