హైదరాబాద్ మెట్రో రెండో దశకు భారీ నిధులు: కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర అధికారులు వెల్లడించారు. ఇందులో రూ.125 కోట్లు రుణం రూపంలో ఇవ్వనున్నట్లు పరిపాలనాపరమైన ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ నిధులతో నగరంలో మెట్రో విస్తరణ పనులు వేగవంతం కానున్నాయని, ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని అధికారులు స్పష్టం చేశారు.