సిరికొండ క్రీడాకారులకు అండగా నిలిచి మురిపించిన ఉమ్మాజీ నరేశ్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సిరికొండ
నిజామాబాద్ రూరల్ సిరికొండలో రేపు నిర్వహించనున్న మండల పరిషత్ స్థాయి క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం నిమిత్తం కాంగ్రెస్ యువజన నాయకుడు ఉమ్మాజీ నరేశ్ రూ.15,000 ఆర్థిక సహాయం నిర్వాహకులకు, పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం పట్ల నిర్వాహకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.