తెలుగు సినిమాకు మోస్ట్ ఎక్సైటింగ్ ఫేజ్ ఇదే: విజయ్ దేవరకొండ

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్’ ప్రీరిలీజ్ వేడుకకు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమాకు మోస్ట్ ఎక్సైటింగ్ ఫేజ్ నడుస్తోందని ఆయన అన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమ్ముడు ఆనంద్ సొంత పంథా సృష్టించుకుంటున్నాడని, ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.