నర్సంపేటలో బీఆర్ఎస్ సమీకరణాలు: స్థానిక నాయకత్వ సంక్షోభంపై తీవ్ర చర్చ
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణానంతరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ సంక్షోభంపై తీవ్ర చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు పార్టీ మారడంతో, ఇతర మండలాల్లోని కీలక నాయకులు కూడా తమ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై అంతర్గత మంతనాలు జరుపుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. దీనిపై కేడర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.