గురుగ్రామ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించి బిట్టు తబాహి బృందం సాహసం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: గురుగ్రామ్
ప్రముఖ పర్యావరణ కార్యకర్త సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి తన స్వచ్ఛతా అభియాన్‌ను ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌కు విస్తరించారు. గురుగ్రామ్‌లోని ఖేడ్కి దౌలా ప్రాంతంలో నిర్వహించిన మూడు రోజుల క్లీన్ విత్ బిట్టు కార్యక్రమంలో భాగంగా ఆయన బృందం ఏకంగా రెండు వేల నాలుగు వందల ముప్పై ఐదు కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించింది. గోమాతలు ప్లాస్టిక్ తిని ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు బిట్టు వెల్లడించారు.