గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో రామచందర్ రావు: బీజేపీలో ఊపందుకున్న కసరత్తు

రిపోర్టర్: మహేష్ స్థలం: Hyderabad

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ వేగవంతం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం కోసం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు వైపే మెజారిటీ నాయకులు మొగ్గు చూపినట్లు సమాచారం. క్షేత్రస్థాయి కేడర్ మూడ్ను అంచనా వేసి కేంద్ర అధిష్ఠానానికి నివేదిక సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.