డీసీ సినిమా విజయం: కోర్ టీమ్‌కు లగ్జరీ కార్లు కానుకగా ఇచ్చిన కళానిధి మారన్

రిపోర్టర్: రమేష్ స్థలం: తమిళనాడు

తమిళ దర్శకుడు అరుణ్ మాథేశ్వరణ్ తెరకెక్కించిన 'డీసీ' సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించింది. ఈ ఘన విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు అరుణ్ మాథేశ్వరణ్, లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు నిర్మాత కళానిధి మారన్ ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను బహుమతిగా అందజేశారు. అయితే, ఈ వేడుకలో హీరోయిన్ వామికా గబ్బికి కారు ఇవ్వకపోవడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.