కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛతా ప్రచారం: వ్యర్థాల విక్రయంతో భారీగా ఆదాయం
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక స్వచ్ఛతా ప్రచారంలో వ్యర్థాల విక్రయం ద్వారా భారీగా ఆదాయం సమకూరిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన ఆరో విడత క్లీనింగ్ డ్రైవ్ ద్వారా వివిధ రకాల స్క్రాప్ ను విక్రయించడం ద్వారా మొత్తం తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల ద్వారానే సుమారు యాభై కోట్ల రూపాయల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.