రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.