నర్సంపేటలో రోడ్డు విస్తరణ పనులు నిలిపివేత: తీవ్ర ఆందోళనలో కాలనీవాసులు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో లేస్తున్న దుమ్ము ఇళ్లలోకి చేరుతోందని వారు వాపోయారు. నిత్యం రాకపోకలు సాగించే వాహనాలతో కాలుష్యం పెరిగి, వృద్ధులు మరియు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.