గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు: గడువు పొడిగింపుపై రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. నామినేషన్ల చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ నెల ఇరవై ఐదున ముసాయిదా ఓటర్ల జాబితా వెలువరిస్తామని, డిసెంబర్ పది వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు.