తీవ్ర వాయు కాలుష్యం: గురుగ్రామ్ లో నవంబర్ 20 వరకు ఆంక్షలు
రిపోర్టర్: సురేష్
స్థలం: గురుగ్రామ్
గురుగ్రామ్ లో వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా నవంబర్ 5 నుండి 20 వరకు కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. నగరంలో ధూళిని సృష్టించే భవన నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు యాభై శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయం వల్ల వాహనాల రద్దడి తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం అదుపులోకి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.