సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై రేవంత్ రెడ్డి అబద్ధాలంటూ జగదీష్ రెడ్డి ఆగ్రహం
రిపోర్టర్: రమేష్
స్థలం: సూర్యాపేట
సింగరేణి సంస్థలో జీ నైన్ రకం బొగ్గు పదమూడు గనుల్లో ఉత్పత్తి అవుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని నిర్లక్ష్యం చేస్తూ తప్పుడు ప్రచారాలకు తెరలేపుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బొగ్గు ఉత్పత్తిపై సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.