కార్మికుల హక్కుల పరిరక్షణకు ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందన్న వెంకటేశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సంస్థాన్ నారాయణపూర్
కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బందరపు వెంకటేశం స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.