హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై స్పష్టతనిచ్చిన కెప్టెన్ శుభ్మన్ గిల్

రిపోర్టర్: శివ స్థలం: ఆక్లాండ్

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎప్పుడు పునరాగమనం చేస్తారనే దానిపై భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పష్టతనిచ్చారు. న్యూజిలాండ్ తో తొలి వన్డేకు ముందు ఆక్లాండ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాండ్యా ఫిట్నెస్ పై తాము నిరంతరం చర్చిస్తున్నామని వెల్లడించారు. దేశీయ క్రికెట్ ఆడి త్వరలోనే అతను జట్టులోకి తిరిగి వస్తాడని తాము గట్టిగా నమ్ముతున్నట్లు శుభ్మన్ గిల్ పేర్కొన్నారు.