ఆసియా క్రీడల వంద మీటర్ల పరుగులో గురిందర్ వీర్ నిష్క్రమణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
ఆసియా క్రీడల పురుషుల వంద మీటర్ల పరుగు పందెం సెమీఫైనల్స్‌లో భారత స్ప్రింటర్లు గురిందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజుర్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్ హీట్లలో మెరుగైన టైమింగ్ సాధించినప్పటికీ ఫైనల్ రేసును చేరుకోలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. గురిందర్ వీర్ ఐదో స్థానంతో సరిపెట్టుకోగా, అనిమేష్ ఏడో స్థానంతో నిష్క్రమించారు. మహిళల హెప్టాథ్లాన్ విభాగంలోనూ భారత అథ్లెట్లు పూజ ఆరో స్థానంలో, అనామిక ఎనిమిదో స్థానంలో నిలిచారు.