సహరాన్‌పూర్‌లో మసీదు కూల్చివేతపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ కలెక్టరేట్ ప్రాంగణంలో శతాబ్ద కాలం నాటి మసీదును కూల్చివేయడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. 'నా మత స్వేచ్ఛ మీ దయపై ఆధారపడి లేదు' అని ఆయన స్పష్టం చేశారు. కలెక్టరేట్ కంటే ముందే మసీదు ఉందని, ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగగా, ప్రతిపక్ష నేతలను పోలీసులు గృహనిర్బంధం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.