మళ్ళీ తన బలమైన జోనర్ లోకి రానున్న డైరెక్టర్ వెంకీ కుడుముల
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ దర్శకుడు వెంకీ కుడుముల రాబిన్‌హుడ్ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో తన తదుపరి చిత్రాన్ని తనకు అసలైన విజయం అందించిన ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లోనే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు. ఛలో, భీష్మ చిత్రాల విజయాల స్పూర్తితో ఈసారి బలమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. నిర్మాతగా ఇట్లు అర్జున సినిమాను అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఆయన, త్వరలోనే తన కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.