కడ్తాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేత

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

కడ్తాల్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో మంజూరైన 1,400 కార్డులలో భాగంగా, మొదటి విడతలో 20 మంది లబ్ధిదారులకు ఆయన స్వయంగా కార్డులను అందజేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందాలనే లక్ష్యంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.