కాటమయ్య ఆలయంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
కాటమయ్య బోనాల వేడుకల సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్‌లోని కాటమయ్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన కాటమయ్యను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.