కొఠియాలో ఎన్నికలను అడ్డుకునే యత్నం: ఏపీ ఒడిశా మధ్య మళ్లీ రాజుకున్న వివాదం
రిపోర్టర్: విజయ్
స్థలం: సాలూరు
ఆంధ్రప్రదేశ్లోని సాలూరు మండలం కొఠియా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణను అడ్డుకునేందుకు ఒడిశా యత్నిస్తోందని స్థానిక అధికారులు తెలిపారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు వివాదాలకు తెరలేపుతున్నారని, అభివృద్ధి పనులను కూడా నిలిపివేయిస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత పరిష్కారం కోరినప్పటికీ, ఒడిశా సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తూ పోలింగ్ ప్రక్రియకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తోందని వెల్లడించారు.