విద్యుత్ కోతలపై కల్వకుర్తిలో బీఆర్ఎస్ మెరుపు ధర్నా
రిపోర్టర్: కిరణ్
స్థలం: కల్వకుర్తి
కల్వకుర్తి నియోజకవర్గంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రావిచెడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి మెరుపు ధర్నా చేపట్టారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.