అచ్చంపేటలో మెగా రక్తదాన శిబిరం: పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నాగర్ కర్నూల్
పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా అచ్చంపేట సబ్ డివిజన్ పోలీస్ శాఖ మరియు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఆవరణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినట్లు పేర్కొంటూ అచ్చంపేట ప్రాంతంలో ఈ కార్యక్రమం ఎంతో స్పందన మధ్య కొనసాగిందని తెలిపారు.