'అందరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం': ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు రాజాంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీనును పార్టీలోకి స్వాగతిస్తున్నామని, అందరూ ఒక కుటుంబంలా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఎమ్మెల్యే సూచించారు. ఈనెల 8న చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరినట్లు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం విజయం సాధించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు నిర్ణయించారు.