ఢిల్లీలో కలకలం: సీజేపీ నేతల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై నిరసనల సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకల జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తమే ఈ కస్టడీ పొడిగింపు కోరినట్లు పోలీసులు స్పష్టం చేశారు.