అద్భుతమైన ఫీచర్లతో త్వరలో మార్కెట్లోకి రానున్న వివో వై600కే టర్బో

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో త్వరలోనే వివో వై600కే టర్బో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన పలు కీలక వివరాలు లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.83-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది చైనాలో లాంచ్ అయిన వివో వై600 టర్బోకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.