రైలు ఢీకొని వంద గొర్రెలు మృతి కన్నీరుమున్నీరవుతున్న యాదగిరిగుట్ట కాపరులు
రిపోర్టర్: P.srinu
స్థలం: భువనగిరి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడంతో దాదాపు 100 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన కాపరులు తమ జీవనాధారమైన గొర్రెలను కోల్పోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కాపరులకు పరిహారం అందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.